ETV Bharat / state

అధికారిక గృహాలు అన్యాక్రాంతం.. అప్పగించాలని పురపాలిక ఆదేశం! - నందికొండ పురపాలక సంఘం

నాగార్జున సాగర్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్లు క్రమంగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తున్నాయి. అధికారిక నివాస గృహాల్లో.. అనర్హులు నివాసముంటున్నారు. నాగార్జున సాగర్​ పరిధిలోని హిల్​కాలనీ, పైలాన్​ కాలనీలో నివాస గృహాల్లో అనధికారిక వ్యక్తులు పెత్తనం చెలాయిస్తున్నారు. రాజకీయంగా ఒత్తిళ్లకు గురి చేసి.. ఎన్నెస్పీ క్వార్టర్లను తమకు కేటాయించేలా చేసి.. వాటిని హస్తగతం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే ఎన్నెస్పీ పరిధిలోని అధికారిక గృహాలు నందికొండ మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Nagarjuna Sagar Project Quarters will Occupied By political Leaders
అధికారిక గృహాలు అన్యాక్రాంతం.. అప్పగించాలని పురపాలిక ఆదేశం!
author img

By

Published : Sep 17, 2020, 9:42 PM IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పనిచేసే సిబ్బంది కోసం డ్యామ్ అథారిటీ సాగర్​లో హిల్ కాలనీ, పైలాన్ కాలనీ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు సీఈ, ఎస్​ఈ, ఈఈ, డీఈఈ, ఏఈ స్థాయి అధికారులు మొదలుకొని ప్రాజెక్టు కోసం పనిచేసే అన్ని స్థాయిల సిబ్బంది స్థానికంగా ఉండేలా 1,350 నివాసగృహాలు నిర్మించింది. గతంలో సాగర్ ప్రాజెక్టు పరిధిలో రెండువేల మంది పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 200కు చేరింది. అధికారులు, సిబ్బంది క్వార్టర్లు ఖాళీ చేసి వెళ్లపోవడం వల్ల అవి ఖాళీగా మారాయి. ఇదే అదునుగా భావించిన రాజకీయ నాయకులు ఇందులో జోక్యం చేసుకుంటున్నారు. నాగార్జున సాగర్ పరిధిలో పని చేసే దిగువస్థాయి ఉద్యోగుల కోసం నిర్మించిన బీ2, సీ , డీ, ఈ, ఈ1, నివాస గృహాలను గత ప్రభుత్వం అందులో నివాసం ఉండే వారికే.. నామమాత్ర ధరకు విక్రయించింది. అలాగే ఎగువస్థాయి నివాస గృహాలను కూడా అందులో నివాసం ఉంటున్న వారికే అమ్మాలని స్థానికులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. కొన్ని మార్పులతో గజాల చొప్పున అమ్మాలని జీవో తెచ్చారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత ఆ జీవో రద్దయింది. కాగా.. ఈ ఆస్తులను నీటి పారుదల శాఖ నుంచి మున్సిపాలిటీకి బదిలీ చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

నాయకుల ప్రయత్నాలు..

ఏడాది క్రితం నందికొండను మున్సిపాలిటీగా మార్చగా.. రాజకీయ ప్రాబల్యం పెరిగి సాగర్ పరిధిలో నివాస గృహాలు ఉండాలన్న కోరికతో పలువురు నాయకులు లక్షల ఖర్చు పెట్టి, అధికారిక నివాస గృహాలకు అర్హులైన సిబ్బందిని భయపెట్టి ఇళ్లను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. నాగార్జున సాగర్​ ప్రాజెక్టు అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఆ అధికారిక నివాస గృహాలను తమకు కేటాయించేలా చేసుకున్నారు. అయితే.. ఈ నివాస గృహాల కేటాయింపు విషయంలో ఇటీవల కాంగ్రెస్, తెరాస నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు త్వరలో ఎన్నెస్పీ క్వార్టర్స్​ను ఆధీనంలోకి తీసుకోనున్నట్టు మున్సిపల్​ కమిషనర్​ తెలిపారు.

ఇదీ చూడండి:- అమెజాన్​లో లక్ష ఉద్యోగాల నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.