Nagarjuna Sagar lifted 22 gates: రాష్ట్రంలోనూ, ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. రిజర్వాయర్ ఇప్పటికే నిండినందున ఎగువ నుంచి వస్తున్న నీటిని వస్తున్నట్లే కిందకు వదిలిపెడుతున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల 16 వేల 821 క్యూసెక్కుల వస్తుంది. సాగర్ 22 క్రస్ట్ గేట్లను 5 అడుగుల ఎత్తి 1 లక్షల 65 వేల 638 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32వేల 886 క్యూసెక్కులు, సాగర్ కుడి, ఎడమ కాల్వలకు 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఎస్ఎల్బీసీకి 1800 క్యూసెక్కుల నీటిని, లో లెవెల్ కాల్వకు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్ జలాశయం నుంచి ఔట్ ఫ్లో 2 లక్షల 16 వేల 821 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఈ నెల 11న 26 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగింది. ఇవాళ 4 గేట్లను మూసివేసి 22 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు.
ఇవీ చూడండి: