నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుండి నుండి వస్తున్న వరద నీటి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తుంది. నాగార్జునసాగర్‌కు శ్రీశైలం జలాశయం నుండి మూడు లక్షల 25 వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. సాగర్ జలాశయం నుండి 14 క్రస్ట్ గేట్ల ద్వారా రెండు లక్షల 94 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న పులిచింతలకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 587.64 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.68 టీఎంసీల వద్ద నీటిని నిల్వ చేస్తున్నారు. 14 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు 20 క్రస్ట్ గేట్ల గేట్ల ద్వారా నీటి విడుదల విడుదల చేయగా.. ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడం వల్ల 4 గేట్లను మూసివేసి.. ప్రస్తుతం 10 గేట్లు ఎత్తారు. వరద ప్రవాహం ఇంకా తగ్గితే గేట్ల సంఖ్యను సైతం తగ్గిస్తామని నాగార్జునసాగర్ జలాశయం సీఈ తెలిపారు.
ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!