నాగార్జున సాగర్ (NAGARJUNA SAGAR) జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో సాగర్ (NAGARJUNA SAGAR) నిండుకుండలా మారింది. జలాశయం 10 గేట్లను 5 అడగుల మేరకు ఎత్తి 81 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ (NAGARJUNA SAGAR) జలాశయం 1,29,359 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 28,313 క్యూసెక్కులు... కుడి, ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం చేస్తున్నామని అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ (NAGARJUNA SAGAR) జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం.. 590 అడగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలకు 312.04 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చూడండి: huzurabad by election campaign: ఇది కాస్త విరామం మాత్రమే.. తర్వాత మామూలుగా ఉండదు..!