Nagarjuna Sagar Dam Farmers Issue : నల్గొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో వరిసాగు పూర్తిగా తగ్గిపోయింది. బోర్లు ఉన్న రైతులు మాత్రమే కొద్దిపాటి భూమిలో వరి సాగు చేస్తున్నారు. సాగర్ నుంచి నీరందక వర్షాల్లేక సాగు చేయలేని పరిస్థితి నెలకొంది.
No Water in Nagarjuna Sagar Dam : గిట్టుబాటు ధర దక్కక ఓ పక్క అల్లాడుతున్న రైతులన రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలాలు కోలుకోలేకుండా చేస్తున్నాయి. వేలకు వేలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడినా చివరకు పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు బావురుమంటున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
"సాగర్ ఎడమ కాలువకు నీరు వదల లేదు. దీంతో ఎకరానికి 6000 -7000 రూపాయలు వానాకాలంలో నష్టపోయాం. యాసంగి పంటనైనా నీరు వస్తుందని ఆశగా ఎదురుచూశాం. సాగర్లో నీరు లేదు. ఉన్న నీరు తాగు నీటికి వదిలిపెట్టారు. దానివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. కొత్త ప్రభుత్వం దున్నడానికో, వడ్లు పోసిన దానికి పరిహారంగా నో ఎకరానికి ఎంతో కొంత ఇవ్వాలి."-రైతులు
సాగర్ ఆయకట్టులో యాసంగి ఆశలు ఆవిరి - ఖమ్మం జిల్లాలో అగమ్యగోచరంగా సాగు పరిస్థితి
"మాకు ఇక్కడ ఎకరం భూమి ఉంది. నీళ్ల కోసం మా పొలంలో బోరు వేసినా పడలేదు. సాగు చేసుకోవడానికి సాగర్ కాలువ ద్వారా నీటి మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు కాలువ నీళ్లు కూడా రావడం లేదు. రెండు సార్లు నారు వేశాం సాగునీరు పంటకు అందకపోతే పంట పండించడం కష్టం. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి."-రైతులు
నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం
Farmers Face Problems Sagar Water Supply : బావుల్లో నీరు తగ్గిపోవడంతో అప్పుచేసి పూడిక తీయించినా బోర్లు వేస్తున్న ప్రయోజనం ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ యాసంగిలో ఆయకట్టు తగ్గనుంది. నీటి కొరతతో నాగార్జునసాగర్ కింద ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
"వర్షాకాలంలో కొద్దోగొప్పో వర్షాలు పడ్డాయి. ఆ తరువాత బోర్లు, బావుల మీద ఆధారపడి పండించాం. వరికి డిమాండ్ ఉండటం వల్ల ఈసారి నార్లు వేశాం. బోర్లకు నీరు సరిపోవడం లేదు. నీరు సరిగ్గా అందక, పంట చేతికి రాక రెండు రకాలుగా నష్టపోతాం. ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఎక్కడ ఏ రకమైన పంటలు పండించాలి అనే దానిపై రైతులకు తెలపాలి. సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని తయారు చేయాలి."- రైతులు
ఊడిపోయిన సాగర్ ఎస్కేప్ గేట్ - వందల ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు - పుట్టెడు దుఃఖంలో అన్నదాతలు