ETV Bharat / state

నాగార్జునసాగర్​కు 69 ఏళ్లు - నూతన వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగింటి బంధం

Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్‌ డ్యాం తెలుగురాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందింది. కోట్లాది మంది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే మానవ నిర్మిత మహాద్భుతంగా, భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా పేరొందింది. 45 వేల మంది కార్మికులు నిత్యం కష్టపడుతూ, 12 ఏళ్ల పాటు శ్రమించి దీనిని నిర్మించారు. వారి ప్రాణ త్యాగ ఫలితంగా ఈ ప్రాజెక్టు 22 లక్షల ఎకరాల సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు విద్యుత్‌ కాంతులను అందజేస్తుంది. తెలుగు రాష్ట్రాలను కరవు రక్కసికబంధహస్తాల నుంచి 68 ఏళ్లుగా కాపాడుతూ, ఇప్పుడు 69 ఏటిలోకి అడుగుపెడుతుంది.

Nagarjuna Sagar Dam turns into 69th year
Nagarjuna Sagar Dam
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 2:28 PM IST

NagarjunaSagar Dam Turn 69th Year : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోట్లాది మంది గొంతు తడుపుతూ, కడుపు నింపుతూ, ప్రతీ ఇంట విద్యుత్ కాంతులు వెదజల్లుతూ, బీడు భూములకు జీవం పోసి బంగారు భూములుగా మారుస్తూ నవ నాగరికతకు నిలయమై, అందరికీ ఆరాధ్యమై, ఆధునిక ఆలయమై విలసిల్లుతోంది. 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.

45 వేల మంది కార్మికులు 24 కష్టపడుతూ, 12 ఏళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టును నిర్మించారు. వారి ప్రాణ త్యాగ ఫలితంగా 22 లక్షల ఎకరాల సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు విద్యుత్‌ కాంతులను అందజేస్తుంది. ప్రపంచంలోనే మానవ నిర్మిత మహాద్భుతంగా, భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా పేరొందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసి సరిగ్గా నేటికి 68 ఏళ్లు పూర్తిచేసుకుని 69వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ డ్యాంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

‘ఇక్కడ నేను చేస్తున్న శంకుస్థాపనను పవిత్ర కార్యంగా భావిస్తున్నా.. ఇది భారత ప్రజా సౌభాగ్య మందిరానికే శంకుస్థాపన.. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయానికి ఇది చిహ్నం..’ - సాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నమాటలు.

ప్రధాని నెహ్రు చేతుల మీదుగా శంకుస్థాపన : ప్రపంచంలోకల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా నాగార్జునసాగర్ ప్రసిద్ధి చెందింది. భారత ఇంజనీర్ల స్వయం సాంకేతిక పరిజ్ఞానానికి, కృష్ణానదిపై నిర్మించిన తొలి జాతీయ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ప్రతిభ, మేధాసంపత్తికి నిదర్శనంగా, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నవభారత నిర్మాత, భారత తొలిప్రధాని పండిట్ జనహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన సందర్భంలో 'ఆధునిక దేవాలయంగా' నాగార్జునసాగర్​ను ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ధాన్యాగారంగా విరాజిల్లి, ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, గ్రామీణ ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి తోడ్పడింది. వ్యవసాయాభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వికాసానికి సాగర్ జలాశయం బాగా ఉపయోగపడింది.

సీఆర్పీఎఫ్ బలగాల అధీనంలోకి సాగర్ డ్యామ్ - వెనుదిరిగిన తెలంగాణ పోలీసులు

22 లక్షల ఎకరాలకు సాగునీరు : నాగార్జునసాగర్ డ్యాం​తో నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు విద్యుత్ వెలుగులను అందిస్తోంది. కోట్ల గొంతుకలను తడుపుతోంది. ఇందులో అమర్చిన హై లెవల్‌, లో లెవల్‌ కెనాల్‌ ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏఎమ్మార్పీ ఎత్తిపోతల ప్రాజెక్టుతో జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీరు లభిస్తోంది. ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రం అనే చెప్పాలి. ఎల్లప్పుడు ప్రాజెక్టును చూడటానికి ప్రపంచంలోని పర్యాటకులు వస్తుంటారు. వారికి తగిన వసతులు కల్పిస్తూ విధంగా ప్రాజెక్టు యంత్రాంగం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రాజెక్టు భవిష్యత్​తో పటిష్టంగా ఉండటానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివరాలు :

రాతి కట్టడం పొడవు : 4756 అడుగులు

ఎత్తు: 409 అడుగులు

మొత్తం జలాశయం పొడవు: 1545 అడుగులు

స్పిల్ వే: 1545 అడుగుల పొడవు

26 క్రస్ట్ గేట్లు(ఒక్కొక్కటి45 x 44 అడుగులు)

డ్యాం పూర్తిస్థాయి నీటి నిలువ ఎత్తు: 590 అడుగులు

కనీస నీటి విడుదల మట్టం: 510 అడుగులు

సాగర్‌ వద్ద పూర్వ పరిస్థితిని పునరుద్ధరించాలంటూ కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

సాగర్ వివాదంపై వీడని అనిశ్చితి - తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.