ETV Bharat / state

సాగర్‌కు కొనసాగుతున్న వరద... 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - నాగార్జునసాగర్ తాజా వార్తలు

నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో 1లక్ష 55 వేల, 529క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా.. జలాశయం 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

nagarjuna sagar dam ten gates lifted
సాగర్‌కు కొనసాగుతున్న వరద... 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
author img

By

Published : Sep 18, 2020, 6:01 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1లక్ష 55 వేల, 529 క్యూసెక్కులు కొనసాగుతోంది. అంతే మొత్తంలో 10 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేయగా... పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.

నాగార్జునసాగర్ జలాశయం 10 గేట్ల ద్వారా 1లక్ష 19 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా... సాగర్ కాల్వకు 8వేల క్యూసెక్కులు, ఎస్​ఎల్​బీసీకి 1800, లో లెవెల్ కాల్వకు 300, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.

సాగర్‌ ప్రాజెక్టులో మొత్తం నీటి మట్టం 590 అడగులు కాగా... ప్రస్తుతం 589.60 అడగులకు చేరింది. మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలకు గానూ... 310.84 టీఎంసీల వద్ద నిల్వ ఉండేలా చేస్తూ.. నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు కొనసాగుతున్న వరద... 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

ఇదీ చూడండి: కళ్లు తిప్పుకోనివ్వని ఎస్సారెస్పీ అందాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.