ETV Bharat / state

సాగర్​ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల - sagar water levels

ఎగువన కురస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద వస్తోంది. జలాయశం 20 క్రస్ట్ గేట్లను ఎత్తి 2 లక్షల 99 వేల 460 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 589.80 అడగులకు చేరింది.

nagarjuna-sagar-dam-20-gates-thrown-open
సాగర్​ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
author img

By

Published : Sep 16, 2020, 9:11 PM IST

Updated : Sep 17, 2020, 12:24 AM IST

నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తుండటం వల్ల 20 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 99 వేల 460 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.... ప్రస్తుతం 589.80 అడగులకు చేరింది. మొత్తం నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలలకు గాను.... 311. 44 టీఎంసీల నీటినిల్వ చేస్తున్నారు.

జలాశయం ఇన్‌ఫ్లో 3లక్షల 38 వేల క్యూసెక్కులు కాగా.. అంతే మెుత్తంలో దిగువకు విడుదల చేశారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 28 వేల క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. దీంతో కృష్ణా నది దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మిగతా 6 గేట్లను ఎత్తే అవకాశం ఉందని తెలిపారు.

సాగర్​ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఇదీచూడండి: ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

Last Updated : Sep 17, 2020, 12:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.