ETV Bharat / state

సాగర్​ సమరం: ముగిసిన నామినేషన్ల గడువు - telangana varthalu

సాగర్​ ఉపఎన్నిక నామపత్రాల దాఖలు గడువు ముగిసింది. ఇవాళ ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు నామపత్రాలు దాఖలు చేశారు.

nagarjuna sagar by election
సాగర్​ ఉపఎన్నిక: ముగిసిన నామినేషన్ల గడువు
author img

By

Published : Mar 30, 2021, 3:18 PM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళ అన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు నామపత్రాలు దాఖలు చేశారు. నిడమనూరు ఆర్వో కార్యాలయంలో.. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి... తెరాస అభ్యర్థి నోముల భగత్‌ నామపత్రాలు దాఖలు చేశారు.

భాజపా అభ్యర్థి పానుగోతు రవికుమార్‌, తెదేపా నుంచి మువ్వా అరుణ్‌ కుమార్‌ నామపత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తం చేశారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువు ఉండగా... ఏప్రిల్‌ 17న నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌ జరగనుంది. మే 2న ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: నామినేషన్ వేసిన జానారెడ్డి, నోముల భగత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.