ETV Bharat / state

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై ఈసీ వేటు

munugode by polls
munugode by polls
author img

By

Published : Oct 20, 2022, 12:47 PM IST

Updated : Oct 20, 2022, 1:22 PM IST

12:43 October 20

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై ఈసీ వేటు

EC dismissed munugode Returning Officer: మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్‌ వేటువేసింది. ఎన్నికల గుర్తుల గందరగోళానికి ముగింపు పలికిన ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యుగ తులసీ ఫౌండేషన్ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్‌ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో రిట్నరింగ్‌ అధికారి తీరును తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్‌ ఆర్వోను మార్చాలని నిర్ణయం తీసుకుంది.

కొత్త ఆర్వో కోసం ముగ్గురు పేర్లను అధికారులు ప్రతిపాదించగా సాయంత్రంలోగా కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు అందనున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ గుర్తు మార్పు వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రిటర్నింగ్ అధికారి తనకు లేని అధికారాన్ని ఉపయోగించి గుర్తు మార్చారని ఆక్షేపించిన ఈసీ.. విధి నిర్వహణలో తీవ్ర లోపం ఉన్నట్లు మండిపడింది. ఈ మేరకు ఆర్వోను మార్చాలని నిర్ణయించింది.

సాయంత్రంలోగా కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు అందనున్నాయి. యుగతులసి అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా నివేదికలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించి, ఆ తర్వాత కనీసం ఎన్నికల పరిశీలకునికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా గుర్తు మార్చి బేబీవాకర్ ఇచ్చినట్లు తేల్చింది. గుర్తు మార్పు విషయమై సంబంధిత అభ్యర్థికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది.

లేని అధికారాన్ని ఉపయోగించి రిటర్నింగ్ అధికారి గుర్తు మార్చడం తగదన్న ఈసీ శివకుమార్​కు ముందు కేటాయించిన రోడ్ రోలర్​కు కొనసాగిస్తూ ఫారం 7ఏను సవరించాలని ఆదేశించింది. సవరించిన ఫారం 7ఏను తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రచురించాలని, ఈసీకి నివేదిక పంపాలని ఆదేశించింది. విధి నిర్వహణలో ఆర్వో లోపాలున్నాయన్న కేంద్ర ఎన్నికల సంఘం గుర్తుల కేటాయింపు వ్యవహారంలో మార్గదర్శకాలను పాటించలేదని ఆక్షేపించింది.

గుర్తు మారుస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది. ఆర్వో వివరణ ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా కమిషన్​కు చేరాలని స్పష్టం చేసింది. ఈ లోగానే రిటర్నింగ్‌ అధికారిని మార్చాలని నిర్ణయం తీసుకుంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత శివకుమార్​కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయిస్తూ ఫారం 7ఏను సవరించారు. గెజిట్ నోటిఫికేషన్ లో ప్రచురించడంతో పాటు బ్యాలెట్ పత్రం ముద్రణకు కూడా ఉపక్రమించారు.

ఇవీ చదవండి: ఆ గుర్తు ఎందుకు మార్చారు.. మునుగోడు ఆర్వోపై ఈసీ సీరియస్

రాజాసింగ్‌ కేసులో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్​

భర్త ఈఎంఐలో మొబైల్ కొన్నాడని.. విషం తాగిన భార్య.. చివరికి..

Last Updated : Oct 20, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.