Palvai Sravanti Morphing Photos: తమ ఓటమి ఖాయమన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారని ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. మరొక పక్క పాల్వాయి స్రవంతి కూడా ఈ విషయమై స్పందించారు. ఓ ఛానల్ వారు తమపై తప్పుడు సమాచారాన్ని ప్రచురించారని.. వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆమె స్పష్టం చేశారు. తనపై ఓ భానల్‌లో వచ్చిన తప్పుడు వార్త ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
-
దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది.
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు#ManaMunugodeManaCongress #MunugodeWithCongress
">దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది.
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2022
కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు#ManaMunugodeManaCongress #MunugodeWithCongressదుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది.
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2022
కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు#ManaMunugodeManaCongress #MunugodeWithCongress
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన ఫోటోను.. మార్ఫింగ్ చేసి ఆ ఫోటోతో.. ఫేక్ ఫోటో క్రియేట్‌చేసి కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచురించారని ఆరోపించారు. తాను విలువలతో కూడిన నాయకురాలినని.. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటి వరకు తాను కేసీఆర్‌ను కలువలేదని ఆమె స్పష్టం చేశారు.
'దమ్ము ధైర్యం ఉంటే నాతో నేరుగా పోటిపడి గెలవాలి కానీ నా ఫోటోలు మార్ఫింగ్ చేయడం ఏంటి? దుబ్బాకలో మాదిరిగానే మునుగోడులో భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆ తప్పుడు సమాచారాన్ని ఓ ప్రైవేట్ ఛానల్ తెలుసుకోకుండా ప్రచారం చేయడం ద్వారా నా పరువుకు నష్టం కలిగింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి ఆ సంస్థ ఎంత దిగజారిపోయింది. నా పరువుకు నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రచారం చేసినందుకు ఆ ప్రైవేట్ ఛానల్‌పై పరువు నష్టం దావా వేస్తాను'.-పాల్వాయి స్రవంతి, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి
ఇవీ చదవండి: