Hyderabad CP CV Anand Apologizes To National Media : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేషనల్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలియజేశారు.
నేషనల్ మీడియాపై సంచలన వ్యాఖ్యలు : సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలియజేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్‌లో ఏం జరిగిందో తెలియజేస్తూ అక్కడి వీడియోలను విడుదల చేశారు. ఈ క్రమంలో మీడియా ఆనంద్‌ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా, నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఈ ఆరోపణలను తప్పుపట్టారు.
I apologise for losing my cool when asked continuous provoking questions on ongoing investigations and making unnecessary general remarks about national media . I feel bad that I got provoked and it was wrong and should have kept calm .I withdraw my remarks wholeheartedly 🙏🏻
— CV Anand IPS (@CVAnandIPS) December 22, 2024
నేషనల్ మీడియాకు సీవీ ఆనంద్ క్షమాపణలు : దీంతో తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ప్రెస్‌మీట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను కాస్త సహనాన్ని కోల్పోయానని తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుందని, తాను చేసింది పొరబాటుగా భావిస్తున్నానని అన్నారు. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని ఆనంద్ తెలిపారు.
మాజీ ఎంపీ విజయశాంతి : ఈ ఘటనపై తాజాగా సినీ నటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌పై బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమన్నారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ పొందాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
అల్లుఅర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - తీవ్ర ఉద్రిక్తత - భారీగా పోలీసుల మోహరింపు
'22 ఏళ్లు కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారు' - బన్నీ కన్నీంటి పర్యంతం