ETV Bharat / state

నగారా మోగింది.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమైన మునుగోడు పోరు - పాల్వాయి స్రవంతి తాజా వార్తలు

Munugode Bypoll Schedule: రాష్ట్రంలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. పోలింగ్‌కు సరిగ్గా నెల రోజుల గడువే ఉండటం.. పార్టీలకు ప్రతిష్టాత్మకమైన పోరు కావటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతల పర్యటనలు, ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారైన నేపథ్యంలో.. ఎన్నికల షెడ్యూల్‌ రావటంతో పార్టీలన్నీ ఇక కదనరంగంలోకి దూకనున్నాయి.

రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమైన మునుగోడు పోరు

author img

By

Published : Oct 3, 2022, 3:47 PM IST

Munugode Bypoll Schedule: ఓ వైపు జాతీయ రాజకీయాల్లోకి అడుగులు పెట్టేందుకు సిద్ధమైన గులాబీ దళం. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న కమలదళం. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైన హస్తం పార్టీ. విజయదశమికి రెండ్రోజుల ముందు వెలువడిన ఉపఎన్నిక షెడ్యూలతో.. రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఉపఎన్నిక అనివార్యమవుతోంది.

మునుగోడు ఉప ఎన్నిక పోరును ప్రధానంగా భావిస్తున్న పార్టీలు: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు జరగనున్న ఈ పోరును ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాషాయ కండువా కప్పుకున్న రాజగోపాల్‌రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలోగి దిగనున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పార్టీ దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఖరారు కాగా.. అధికార తెరాస ఇప్పటి వరకు తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు.

మునుగోడు ఉపఎన్నికతోనే జాతీయ పోరు: విజయదశమి వేళ జాతీయ పార్టీ ప్రకటనకు సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికతోనే జాతీయ పోరును ప్రారంభించాలని నిర్ణయించారు. మునుగోడులో గత ఎన్నికల్లో ఓటమి పాలైన అధికార పార్టీ రాజగోపాల్‌రెడ్డి తీరుతో ఉప ఎన్నికలు వస్తాయనే తొలి నుంచి అంచనాతో ఉంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు పలు దఫాలు సమావేశం కావటం కేటీఆర్ వరుసగా భేటీలు జరుపుతూ సమాయత్తం చేశారు.

ప్రత్యేక వ్యూహాలతో తెరాస: నియోజకవర్గంలోని పెండింగ్‌ సమస్యలపై దృష్టి సారించటంతో పాటు గట్టుప్పల్‌ మండలాన్ని ప్రకటించారు. మరోవైపు నియోజకవర్గంలోని బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకుంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్‌లలో ఓటమి పాలైన నేపథ్యంలో మునుగోడులో గెలుపును పార్టీ కీలకంగా భావిస్తోంది.

ఆ నియోజకవర్గాల్లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకొని ముందుకు సాగాలని భావిస్తోంది. గత ఉపఎన్నికల్లా కాకుండా ఈ సారి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సైతం మునుగోడులో బహిరంగసభకు హాజరయ్యారు. అభ్యర్థి ఎంపిక, ప్రచారం, అంచనాలు తదితర అంశాలపై ప్రత్యేక వ్యూహాలతో తెరాస ముందుకుసాగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్న సమయంలో రాష్ట్రంలో వచ్చిన తొలి సమరంలో గెలుపే లక్ష్యంగా తెరాస వ్యూహాలు పన్నుతోంది.

గత ఎన్నికల్లో పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడైన అమిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు మరికొందరు నేతలు ఇక్కడి తెరాస టికెట్‌ ఆశిస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్‌ ఇవ్వొద్దంటూ పార్టీ అసంతృప్తి చెలరేగిన వేళ.. అధినేతతో జరిగిన చర్చలతో నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తెరాస అభ్యర్థిత్వం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవటంతో ఎవరికి టికెట్‌ వస్తుందో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న కాషాయదళం: మరోవైపు దుబ్బాక, హుజూరాబాద్‌లలో వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న కాషాయదళం మునుగోడులోనూ సత్తాచాటి.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇక్కడ విజయం సాధించి రాష్ట్రంలో తెరాసకు తామే ప్రత్యామ్నాయమన్న సంకేతాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని భాజపా నాయకులు ఆశిస్తున్నారు.

కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరటంతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ నియోజకవర్గంలో భాజపా గతంలో ఎప్పుడూ కనీసం రెండోస్థానంలో కూడా సాధించలేదు. 2009 నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో గంగిడి మనోహర్‌రెడ్డి ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసినా మూడో స్థానానికే పరిమితమయ్యారు. పార్టీకి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, నలుగురు సర్పంచులు, చౌటుప్పల్‌లో ముగ్గురు, చండూరులో ఒక కౌన్సిలర్‌ మాత్రం ఉన్నారు.

గత ఆరు నెలలుగా సంస్థాగతంగా బలోపేతంపై భాజపా నేతలు దృష్టిసారించారు. పోలింగ్‌ బూత్‌లకు కమిటీలు వేశారు. నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉన్నా కోమటిరెడ్ది రాజగోపాల్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి కానున్నారు. రాజగోపాల్‌ భాజపా కండువా కప్పుకునే సమయంలో పార్టీ అగ్రనేత అమిత్‌ షా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

రాజగోపాల్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు రావడంతో కమలదళం గెలుపు ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్న రాజగోపాల్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్: రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ ఈ ఉప ఎన్నికతో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తొలి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి నల్గొండ జిల్లాలో జరుగున్న ఈ ఉపఎన్నికలో పార్టీకి విజయం కీలకం కానుంది. అభ్యర్థి ఎంపికలోనూ గతంలో మాదిరిగా కాకుండా అందరికంటే ముందుగానే నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్.. తమ అభ్యర్థిగా దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని బరిలోకి దించింది.

కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాస్‌నేతలు ఆశించినప్పటికీ స్రవంతివైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిలకు ఈ ఎన్నిక కీలకం కానుంది. తాజాగా ఏర్పాటైన గట్టుప్పల్‌ మండలం సహా మొత్తం ఏడు మండలాల్లో సంస్థాగతంగా తమ పార్టీకి ఉన్న బలంపై నేతలు నమ్మకంగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.