ETV Bharat / state

జానారెడ్డి తెలంగాణ ఆత్మగౌరవం: ఎంపీ రేవంత్ రెడ్డి - sagar election campaign

సాగర్ ఉపఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి, అభ్యర్థి జానారెడ్డి పాల్గొన్నారు.

sagar latest news
సాగర్ ఉప ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 10, 2021, 5:18 AM IST

ఉద్యోగాలు భర్తీ చేయని కారణంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సాగర్ ఎన్నికల ప్రచారంలో ప్రచారంలో భాగంగా జానారెడ్డితో కలిసి సాగర్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి పెద్దవూర మండలం పర్వేదుల, పులిచర్ల తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సీఎం పదవిని తృణప్రాయంగా తోసిపుచ్చిన జానారెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని కోరారు. జానారెడ్డి నీడన ఎదిగిన శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావులు.. నేడు ఆయనకే వ్యతిరేకంగా ప్రచారం చేయడం తగదన్నారు.

సాగర్ ఉప ఎన్నికల ప్రచారం

జానా తెలంగాణ ఆత్మగౌరవమని వివరించిన ఆయన.. ఉద్యమ జేఏసీ పుట్టిందే జానా ఇంట్లో అని గుర్తుచేశాడు. ఆయన వలనే నేడు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ ప్రజలు ఆలోచన చేసి ప్రజానాయకుడు జానారెడ్డిని గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి:ఆర్సీబీ తొలి పంచ్.. ముంబయిపై అద్భుత విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.