ETV Bharat / state

జానారెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం: రేవంత్

నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్​పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎలక్షన్లను సీఎం కేసీఆర్​ కలెక్షన్లుగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని నిరూపస్తానని సవాలు విసిరారు.

mp revanth reddy press meet, mp revanth reddy fires on cm kcr
ఎంపీ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం, సీఎం కేసీఆర్​పై ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు
author img

By

Published : Apr 10, 2021, 4:51 PM IST

ఎలక్షన్లను కలెక్షన్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్​దేనని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ప్రచారానికి ఒక్కసారి వెళ్లని సీఎం... సాగర్​కు రెండు సార్లు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. సానుభూతి కోసమే భగత్​కు టికెట్ ఇచ్చారని విమర్శించారు. సాగర్​లో జానారెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. నల్గొండ జిల్లా పెద్దవూరలో మండలం పులిచర్ల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ బిల్లును ఆమోదించడానికి జానారెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు ఎంతో కృషి చేశారని అన్నారు. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని జానారెడ్డి వదులుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని తాను నిరూపిస్తానని సవాలు విసిరారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, స్థానిక కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రేవంత్​కు తెరాస గురించి మాట్లాడే అర్హత లేదు: బాల్క సుమన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.