ETV Bharat / state

ఎవరిని కొడతారో చూద్దామా..?: రేవంత్​

author img

By

Published : Apr 13, 2021, 8:24 PM IST

ఓయూకు వెళ్తే.. అక్కడ ఎవరి​ బట్టలు చినిగేలా కొడతారో చూద్దామా అంటూ ఓ తెరాస ఎమ్మెల్యేకు సవాల్​ విసిరారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి. తెలంగాణ రావడంలో జానారెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. ఆయన్ను గెలిపించాలని కోరారు.

mp, revanth reddy
మల్కాజిగిరి ఎంపీ, రేవంత్​ రెడ్డి

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించాలని చెబుతున్న తెరాస, భాజపా నాయకులపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రావడంలో జానారెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెరాసని కాంగ్రెస్​లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడని విమర్శించారు.

మల్కాజిగిరి ఎంపీ, రేవంత్​ రెడ్డి

జానారెడ్డి విజయం తెలంగాణకు అవసరమన్నారు. తెరాస నాయకులు 15న ప్రచారం అయిపోయిన తర్వాత సాగర్ నుంచి బయలుదేరి ఉస్మానియావిశ్వవిద్యాలయం వెళ్దామన్నారు. అక్కడ రాత్రి వరకు ఉంటే ఎవరి బట్టలు చినిగేలా కొడతారో చూద్దామా అని సవాలు విసిరారు. సాగర్​లో తెరాస, భాజపా డ్రామాలు అడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఇవ్వమంటేనే భాజపా రవి కుమార్​కు టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. భాజపాలో బండి సంజయ్​కు కేంద్ర మంత్రికి ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి: ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్​, తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.