MP Komatireddy letter to Sonu Sood Foundation: ఆపద ఉందని తెలిస్తే చాలు.. అక్కడ వాలిపోవటమో..? తనకు చేతనైన సాయం చేయటమో..? ఎలా అయితే ఏంటీ.. వారి జీవితాల్లో ఆనందం నింపటమే అతడి కర్తవ్యం.. అనేలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. అలాంటి సోనూసూద్‌కు ఇప్పుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.
అసలు విషయమేమిటంటే... సినీనటుడు సోనూసూద్ ఫౌండేషన్‌కి ట్విట్టర్ ద్వారా ఎంపీ లేఖ రాశారు. తన పార్లమెంట్ పరిధిలోని జనగామ జిల్లాకు చెందిన చామకూర శ్రీనాథ్ వ్యవసాయ పనులు చేస్తుండగా.. ప్రమాదం జరిగి ఎడమ చెయ్యికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో గాయమైన ఎడమ చెయ్యికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. శ్రీనాథ్ తండ్రి నిరుపేద రైతు కావడంతో ఆపరేషన్‌కు డబ్బులు లేక బాధపడుతున్నారు.
పేదరికంలో ఉన్న శ్రీనాథ్‌కు ఆపరేషన్ జరిగేలా సోనూసూద్ ఫౌండేషన్ ఆదుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు ట్విట్టర్లో లేఖను పోస్ట్ చేశారు. మరి ఈ విజ్ఞాపన లేఖకు సోనూసూద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి..!
-
I humbly request Sri @SonuSood Smt @libransood to help Ch.Sainath who has met with an accident and his right hand arm got amputated. He hails from my parliamentary constituency.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) May 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Sainath is son of a poor farmer & Please support for his medical treatment through @SoodFoundation pic.twitter.com/wIRoeiY7zb
">I humbly request Sri @SonuSood Smt @libransood to help Ch.Sainath who has met with an accident and his right hand arm got amputated. He hails from my parliamentary constituency.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) May 11, 2022
Sainath is son of a poor farmer & Please support for his medical treatment through @SoodFoundation pic.twitter.com/wIRoeiY7zbI humbly request Sri @SonuSood Smt @libransood to help Ch.Sainath who has met with an accident and his right hand arm got amputated. He hails from my parliamentary constituency.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) May 11, 2022
Sainath is son of a poor farmer & Please support for his medical treatment through @SoodFoundation pic.twitter.com/wIRoeiY7zb
ఇదీ చదవండి: ఆ క్వారీల్లో మైనింగ్ ఆపాలని ఎన్జీటీ ఆదేశం