ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​ ప్రజల వద్దకే మొబైల్​ మార్కెట్లు - మొబైల్​ మార్కెట్లు

కరోనా వ్యాప్తిని అరికట్టే నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మొబైల్​ మార్కెట్లను ఎమ్మెల్యే భాస్కర్​రావు ప్రారంభించారు. ప్రజలు ఒకే వద్ద గుమిగూడి కూరగాయలు కొనుగోలు చేయకండా వారివారి కాలనీల్లోనే విక్రయాలు జరిపే విధంగా వీటిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

mobile farmer markets are inaugirated by mla bhaskar rao at miryalaguda nalgonda
లాక్​డౌన్​ ఎఫెక్ట్​ ప్రజల వద్దకే మొబైల్​ మార్కెట్లు
author img

By

Published : Apr 4, 2020, 11:45 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచార కూరగాయల వాహనాలను ఎమ్మెల్యే భాస్కర్​రావు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో స్థానిక ఎస్​ఎస్​పీ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​లో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ప్రజలు సామాజిక దూరం పాటించడం కష్టమవుతోంది. ఇంటి వద్దకే కూరగాయలు చేరవేసే విధంగా ఈ మొబైల్​ మార్కెట్లను ఏర్పాటు చేశారు.

ప్రజలందరూ ఒకే దగ్గర గుమిగూడి కూరగాయలు కొనకుండా ఏ కాలనీ వారు ఆ కాలనీలోనే కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసుకునే విధంగా ఈ సంచార వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాస్కరరావు సూచించారు.

ఇదీ చూడండి: 'జమాత్​' బాస్​పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.