ETV Bharat / state

'పట్టభద్రులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'

నల్గొండ జిల్లా మిర్యాలగూడ గ్రంథాలయంలో ప్రైవేట్​ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావుతో కలిసి ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పట్టభద్రుని చేత ఓటు నమోదు చేయించేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ సూచించారు.

MLC palla rajeshwar reddy awareness on MLC Voters registration at miryalaguda
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మిర్యాలగూడలో అవగాహన కార్యక్రమం
author img

By

Published : Oct 8, 2020, 11:24 AM IST

నల్గొండ మిర్యాలగూడ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​రెడ్డి కోరారు. మిర్యాలగూడ గ్రంథాలయంలో ప్రైవేట్​ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావుతో కలిసి ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరచాలని పల్లా రాజేశ్వర్​రెడ్డి సూచించారు. అక్టోబర్​ 2017లోపు పట్టభద్రులైన వారంతా నవంబర్​6లోపు... తమ పేర్లపై ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే పట్టం కట్టేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.

ఇదీ చదవండిః శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలపై తెరాస కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.