ETV Bharat / state

లాక్​డౌన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యేలు - latest news on MLAs educating the people on lockdown in nalgonda district

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులంతా బయటకు వస్తున్నారు. కరోనా నివారణ చర్యల పట్ల, లాక్​డౌన్​ పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నారు.

MLAs  educating the people on lockdown in nalgonda district
లాక్​డౌన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యేలు
author img

By

Published : Mar 26, 2020, 5:48 PM IST

నల్గొండ జిల్లా దేవరకొండలోని మార్కెట్​ను స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అధికారులతో కలిసి సందర్శించారు. అమ్మకందార్లను అడిగి కూరగాయల రేట్లను తెలుసుకున్నారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ఎవరూ కూరగాయలను అధిక ధరలకు అమ్మరాదని.. అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్​డౌన్​తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.

హాలియాలోనూ..

మరోవైపు హాలియా పురపాలక సంఘ పరిధిలో నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా తన నెల జీతాన్ని, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 3 కోట్లను సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో, రాష్ట్రంలో వ్యాపించడం, ప్రజలను ఇబ్బందిపెట్టడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

కరోనాను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ను అర్థం చేసుకుని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

లాక్​డౌన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యేలు

ఇదీ చూడండి:కరోనా సోకిందన్న డౌట్​తో బస్సు డ్రైవర్​ ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.