ఆస్పత్రులు, వైద్యం కోసం చేసే ఖర్చులు సద్వినియోగం కావట్లేదని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ దీనిపై కూడా సరైన నిర్ణయం తీసుకుకోవాలని చెప్పారు. గ్రామాల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనూ పాఠశాలలు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వం పల్లె ప్రగతి, హరితహారం వంటి మంచి కార్యక్రమాలు చేసి పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. పల్లెల్లో ఉండే ఈ మంచి వాతావరణాన్ని మద్యం దుకాణాలు పాడుచేస్తున్నాయని చెప్పారు. మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేవని వెంటనే వీటిని మరమ్మతులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్