ETV Bharat / state

''ఆర్‌ఆర్‌ఆర్‌'ను బ్రేక్‌ చేయలేరు.. మరో 'ఆర్‌'ను ఆపలేరు' - MLA Raghunandan Rao campaign in munugode

MLA Raghunandan Rao Latest Comments: భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెరాస నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్వరలోనే ఓ భాజపా ఎమ్మెల్యే తెరాసలో చేరతారంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ క్రమంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను బ్రేక్ చేయలేరు.. మరో 'ఆర్‌'ను ఆపలేరంటూ తేల్చి చెప్పారు.

''ఆర్‌ఆర్‌ఆర్‌'ను బ్రేక్‌ చేయలేరు.. మరో 'ఆర్‌'ను ఆపలేరు'

author img

By

Published : Oct 22, 2022, 12:25 PM IST

Updated : Oct 22, 2022, 2:15 PM IST

''ఆర్‌ఆర్‌ఆర్‌'ను బ్రేక్‌ చేయలేరు.. మరో 'ఆర్‌'ను ఆపలేరు'

MLA Raghunandan Rao Latest Comments: భాజపాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమతో టచ్‌లో ఉన్నారని.. త్వరలోనే తెరాసలో చేరతారంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. అవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టి పారేశారు. ఈ సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను బ్రేక్‌ చేయలేరు.. మరో 'ఆర్‌'ను ఆపలేరంటూ తేల్చి చెప్పారు. మునుగోడు నియోజకవర్గానికి సంబంధం లేని నేతలు తెరాసలో చేరుతున్నారన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే ఆప్టిక్స్‌ అండ్‌ ఇల్యూషన్స్‌ నీతిని కేసీఆర్‌ మర్చిపోతున్నారని రఘునందన్‌రావు విమర్శించారు. 3 ఏళ్లుగా గొర్రెల కాపరులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. 2014-2018 వరకు ఎమ్మెల్యేగా ప్రభాకర్‌రెడ్డి ఉన్న సమయంలో చౌటుప్పల్‌ నుంచి సంస్థాన్‌ నారాయణపురం వరకు రహదారి నిర్మాణం కోసం రూ.1.30 కోట్లు మంజూరు చేశారన్న రఘునందన్‌రావు.. అప్పుడు మంజూరైన రహదారి ఇప్పుడు వేస్తున్నారని తెలిపారు. వాట్సప్‌ జర్నలిజం వచ్చాక ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజానికి రోజులు చెల్లిపోయాయన్నారు.

మునుగోడు నియోజకవర్గానికి సంబంధం లేని నేతలు తెరాసలో చేరుతున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను బ్రేక్‌ చేయలేరు. మరో 'ఆర్‌'ను ఆపలేరు. 3 ఏళ్లుగా గొర్రెల కాపరులకు సంబంధించిన నిధులు ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదు. గతంలో చౌటుప్పల్‌ నుంచి సంస్థాన్‌ నారాయణపురం వరకు రహదారి మంజూరు చేశారు. ఆ రహదారి ఇప్పుడు వేస్తున్నారు. వాట్సప్‌ జర్నలిజం వచ్చాక.. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజానికి రోజులు చెల్లిపోయాయి. - రఘునందన్‌రావు, భాజపా ఎమ్మెల్యే

ఇవీ చూడండి..

మునుగోడులో భాజపా ముమ్మర ప్రచారం.. రంగంలోకి సీనియర్ నేతలు

'స్కూల్ రద్దు చేయకండి.. ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తే చాలు'

సాఫ్ట్​వేర్​ ఉద్యోగినిపై 10 మంది అత్యాచారం.. ఎవరూ లేని ప్రాంతానికి లాక్కెళ్లి..

Last Updated : Oct 22, 2022, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.