ETV Bharat / state

త్రిపురారంలో  హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నోముల - హరితహారం

మొక్కలు నాటి.. అడవులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా హరితహారం కొనసాగుతున్నదని, ఆ బాధ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి, సంరక్షించాలని నాగార్జున సాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో ఆయన హరితహారంలో పాల్గొన్నారు.

MLA Nomula Narsimhaiah Participated In Haritha H aram
త్రిపురారంలో  హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నోముల
author img

By

Published : Jun 27, 2020, 2:34 PM IST

నల్గొండ జిల్లా త్రిపురారంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆరవ విడత హరితహారంలో పాల్గొన్నారు. జెడ్పీ ఛైర్​ పర్సన్​ బండ నరేందర్​ రెడ్డితో కలిసి రహదారికి ఇరుపక్కల మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ఆడవులను పెంచడం కోసం, రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం హరితహారం కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. అశోకుడి కాలం నుంచి రోడ్లకు ఇరు వైపులా చెట్లు నాటాాడని చదువుకున్నా . ఇప్పుడు మనమే చెట్లు నాటుతున్నామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో అధిక సంఖ్యలో మొక్కలు నాటి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్రిపురారంలో రూ.17 లక్షల వ్యయంతో 60వేల లీటర్ల సామర్ధ్యం గల మిషన్ భగీరథ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్​ను ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో వచ్చే నెల మొదటి వారం నాటికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని అందిస్తాంమని జెడ్పీ ఛైర్మన్​ బండ నరేందర్​ రెడ్డి తెలిపారు.

ఇవీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.