ETV Bharat / state

Rajagopal Reddy: మునుగోడులో అమలు చేస్తే రాజీనామా చేస్తా: రాజగోపాల్ రెడ్డి - మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

తన నియోజకవర్గంలో దళితబంధు అమలు చేస్తానంటే రాజీనామా చేస్తానని మునుగోడు​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్​ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

komatireddy rajagopal reddy
మునుగోడు​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి
author img

By

Published : Oct 3, 2021, 4:06 PM IST

Updated : Oct 3, 2021, 5:11 PM IST

తెరాస మంత్రులు ఇతర పార్టీ వాళ్లను చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాల అభివృద్ధిని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. మునుగోడులో దళితబంధు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరోసారి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

మునుగోడు అభివృద్ధిని మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇతర మంత్రులు కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధి పట్టడం లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన ఓటమికి కృషి చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి సహకారం ఇవ్వకపోయినా కరోనా విపత్కర పరిస్థితుల్లో ఐదు కోట్ల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను తెరాసలో చేర్పించుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

komatireddy rajagopal reddy

'తెరాస ప్రభుత్వం రెండోసారి ఏర్పడి మూడేళ్లయింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు. మునుగోడులో అభివృద్ధికి సహకరించమని మంత్రిని అడిగినా కూడా స్పందన లేదు. మంత్రిగా ఉండి ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడమే ఆయన పని. చిరుమర్తి లింగయ్యను చేర్చుకున్నరు. అలాగే మా నేతలను మరికొంత మందిని కూడా తెరాసలో చేర్చుకున్నారు. మీరు అభివృద్ధి చేస్తే ఇతర పార్టీల నేతలు మీకెందుకు. నా నియోజకవర్గానికి వచ్చిన మంత్రి పిచ్చివేషాలు వేస్తున్నడు. ఇక్కడే కాదు.. సూర్యాపేటలో నీకు సరైన బుద్ధి చెబుతా. అభివృద్ధికి సహకరించకుండా తన ఒక్క నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో నిధులు మళ్లించుకుంటున్నారు. మునుగోడులో నీతి మాలిన రాజకీయం చేస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ఓటమి తథ్యం. హుజూరాబాద్​లో అమలు చేస్తున్న దళిత బంధును మునుగోడు నియోజకవర్గంలో కూడా ఆమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉపఎన్నిక జరిగితే పోటీ కూడా చెయ్యను.'

- కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

ఇదీ చూడండి: Rajagopal Reddy Resignation: 'అలా చేస్తే నేనే దగ్గరుండి తెరాసను గెలిపిస్తా'

Last Updated : Oct 3, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.