ETV Bharat / state

రంజాన్​ తోఫా అందించిన ఎమ్మెల్యే

రంజాన్ పండుగను పురస్కరించుకొని పేద ముస్లింలకు రంజాన్ తోఫాను ఎమ్మెల్యే భాస్కరరావు అందించారు. నల్గొండ జిల్లా సీతారాంపురం చిన్న మసీదులో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా రెండోదశ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

mla basker rao, Ramjan thofa, miryalaguda news

author img

By

Published : May 9, 2021, 6:09 PM IST

మైనార్టీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని... వారి అభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సీతారాంపురం చిన్న మసీదులో రంజాన్ పండుగను పురస్కరించుకొని.. పేద ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.

పేద ముస్లిం మహిళలకు షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్య, విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని తెరాస ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్యే అన్నారు.

ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గంలో ఈద్గా కోసం కేటాయించినట్లు గుర్తు చేశారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడి, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.