నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రపాలకుల బానిసలుగా పనిచేసిన వారికి తెరాస పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి రాష్ట్రం తీసుకొచ్చారని గుర్తు చేశారు.
రూ.కోట్లు ఎలా వచ్చాయి?
ఉద్యమం సమయంలో రేవంత్ ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి రూ.కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. 2018లో కొడంగల్‌లో ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ఓడిపోలేదని అన్నారు.
ఆనాడు వచ్చారా?
నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతున్ననాడు ఏనాడైనా వచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిల్లీ, గల్లీలో లేదని విమర్శించారు. నాగార్జున సాగర్ అభివృద్ధి చెందాలంటే తెరాస అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'కేసీఆర్ సర్కారు అంటేనే ఒకే ఇంటి పాలన...'