తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడు ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో ముస్లింలు, మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెరాస ఇంఛార్జి తక్కలపల్లి రవీందర్ రావు, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హాలియా ఎన్నికల ఇంఛార్జి కోరుకంటి చందర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,నోముల లక్ష్మీ పాల్గొన్నారు.
జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుని ప్రచారం చేయకుండా ఎవరి కార్యాలయంలో వారు కూర్చుందామని సూచనలు చేస్తున్నారని మంత్రులు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో లేరని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, మిషన్ భగీరథ, పథకాల ద్వారా పేద ముస్లిం ప్రజలను ఆదుకుంటున్నామన్నారు. 2018 ఎన్నికల్లో నోములు నరసింహయ్య ఎలా గెలిచారో... ఇప్పుడు కూడా నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.