ETV Bharat / state

ఏడో నెంబర్​ అవుతాడే తప్పా చేసేదేమీ ఉండదు: తలసాని - telangana latest news

కాంగ్రెస్​ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. సాగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి గెలిస్తే ఏడో నెంబర్​ అవుతాడే తప్పా చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు.

జానారెడ్డిపై మంత్రి తలసాని విమర్శలు
జానారెడ్డిపై మంత్రి తలసాని విమర్శలు
author img

By

Published : Apr 13, 2021, 9:58 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలిచి చేసేదేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ విమర్శించారు. ఆ పార్టీకి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈయన గెలిస్తే ఏడో నెంబర్ అవుతాడే తప్పా.. చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్, పోలీసులు స్పందించాలన్నారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్న నాయకుడు సీఎం కేసీఆరే అని వ్యాఖ్యానించారు. రేపు జరగబోయే సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చూడండి: రేపు హాలియా బహిరంగ సభకు సీఎం కేసీఆర్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.