ETV Bharat / state

కార్యకర్త నివాసంలో మంత్రి తలసాని ఉగాది వేడుకలు

ప్లవ నామ సంవత్సరంలో అన్ని విధాల శుభం కలగాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రంలోని కార్యకర్త నివాసంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు.

Minister Talasani at the Ugadi celebrations
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని
author img

By

Published : Apr 13, 2021, 3:48 PM IST

రైతును రాజుగా చేసేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్లవ నామ సంవత్సరంలో ప్రజలంతా ‌ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రంలోని కార్యకర్త ఈదయ్య నివాసంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చడి స్వీకరించారు.

కాంగ్రెస్ నాయకులు తమ హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా... తెరాస పార్టీని నోటికొచ్చినట్లు విమర్శించడాన్ని... ప్రజలు గమనిస్తున్నారని తలసాని అన్నారు. చైతన్యవంతులైన సాగర్ ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్​కు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. బుధవారం హాలియాలో జరిగే ముఖ్యమంత్రి సభకు ఉత్సాహంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, హాలియా మున్సిపల్ ఛైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.