ఎంతటి సంక్షోభ పరిస్థితుల్లోనూ... రైతులు, పేదల సంక్షేమం మరువమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో పర్యటించిన కేటీఆర్... వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న విద్యుత్తు ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.
అంతకుముందు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి.. స్థానిక కనకదుర్గ కూడలిలో మొక్కలు నాటారు. ఉదయ సముద్రం, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువలను పూర్తి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌కు మంత్రి బయలుదేరారు.