నల్గొండ జడ్పీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. రహదారులు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
గత సీజన్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వరి ధాన్యం దిగుబడిని అందించిన నల్గొండ జిల్లాలో.. ఖరీఫ్ సీజన్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.