తెలంగాణ ఏర్పడే నాటికి రైతు అని చెప్పుకోవడానికే భయపడే రోజులు ఉండేవని.. మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే వ్యవసాయాన్ని పండగ చేసి చూపారన్నారు. కేసీఆర్ ఏం చేశాడని.. ఓ పెద్దాయన అంటున్నారని.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఆకలి, ఆత్మహత్యలు లేకుండా చేశాడని నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని ఉద్దేశించి.. జగదీశ్‌రెడ్డి అన్నారు.
నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో.. తెరాస అభ్యర్థి నోముల భగత్ తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం చేశారు. ఓటు ఎంతో విలువైందని.. మాయమాటలు చెప్పే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కేవలం తుమ్మడం గ్రామంలో.. రైతుబంధు, రుణమాఫీ, చెరువుల అభివృద్ధి, కరెంటు, మంచినీళ్లకు, పింఛన్లకు రూ. 22.50 కోట్లు ప్రతినెలా ఖర్చు అవుతున్నాయని జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దళారీ వ్యవస్థే లేదని.. నేరుగా లబ్ధిదారులకు అన్ని పథకాలు అందే విధంగా అమలుచేస్తున్నారని మంత్రి చెప్పారు.
ఇవీచూడండి: సాగర్ పోరు: ప్రభావితం చేసే ప్రత్యర్థిపైనే దృష్టి