ETV Bharat / state

అసోం సీఎం కంటే సంస్కార హీనుడు రేవంత్​ రెడ్డి: మంత్రి జగదీశ్​ రెడ్డి - jagadeesh reddy latest news

Minister Jagadish reddy: సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు సంస్కారయుతంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్​ అన్నారని మంత్రి గుర్తు చేశారు.

jagadeesh reddy comments on revanth reddy
మంత్రి జగదీశ్​ రెడ్డి, నకిరేకల్​లో రక్తదాన శిబిరం
author img

By

Published : Feb 16, 2022, 3:49 PM IST

Minister Jagadish reddy: గురువారం.. సీఎం కేసీఆర్​ పుట్టినరోజును పురస్కరించుకుని నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీశ్​ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసోం సీఎం కంటే రేవంత్​ రెడ్డి సంస్కార హీనుడన్న మంత్రి.. ఉన్నత పదవుల్లో ఉన్న వారు సంస్కారయుతంగా వ్యవహరించాలని కేసీఆర్​ అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను ఖండించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా.. రేవంత్ రెడ్డి ఇతర పార్టీలకు కోవర్ట్​గా పనిచేసి రాష్ట్రాన్ని బలహీన పరిచే చర్యలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తద్దినం పెట్టడానికి రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నుంచి కోవర్టుగా వచ్చారని.. ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చెప్పారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: KTR Comments on Modi : 'మోదీకి మరో అవకాశమిస్తే.. తెలంగాణ-ఆంధ్రాను కలిపేస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.