నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి.. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. తర్వాత పట్టణంలోని రాంనగర్ కాలనీలో మున్సిపల్ పార్కును కొత్త హంగులతో నిర్మించేందుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
మున్సిపల్ పార్కు నిర్మించేందుకు ముఖ్యమంత్రి రూ. 1.5 లక్షల నిధులను మంజూరు చేశారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు విస్తరిస్తున్నందున వ్యాపారులందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని ఆయన కోరారు. ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా ప్రజలు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని భూపాల్‌రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు