తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలో జరిగిన పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్యతో కలిసి పాల్గొన్నారు. త్వరలో జరగబోయే నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసనే గెలిపించాలని కోరారు.
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలు తీసుకురానుందని తెలిపారు. ఖాళీలను బట్టి ఉద్యోగాలను భర్తీ చేస్తుందని మంత్రి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం కండి : జగదీశ్‌రెడ్డి