సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్ట్ వద్ద వలస జీవులు పడిగాపులు కాస్తున్నారు. అనుమతి పత్రాలు చూపిన వలస కార్మికులను తెలంగాణ పోలీసులు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అయితే సరైన పత్రాలు లేవంటూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గరికపాడు వద్ద 100 మంది వలస కార్మికులను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రాకు చెందిన వీరంతా అదిలాబాద్, భూపాలపల్లి, హైదరాబాద్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు పని కోసం వెళ్లి... ఇప్పుడు స్వస్థలాలకు బయలుదేరారు.
అధికారుల దగ్గర గంటల కొద్దీ నిల్చొని పాసులు పొందామని... తీరా ఇక్కడికి వచ్చాక డీజీపీ, కమిషనర్ స్థాయి అధికారుల నుంచి అనుమతి పత్రాలు తీసుకు రావాలంటున్నారని కార్మికులు చెప్పారు. తెలంగాణ పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు వలస కూలీలకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. చిన్న పిల్లలతో నడి రోడ్లపై నిల్చున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఆంధ్రా నుంచి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ చెక్‌పోస్ట్ వద్ద ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులోనే హోమ్ క్వారంటైన్ ముద్రలు వేసి రాష్ట్రంలోనికి రానిస్తున్నామని తెలంగాణ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రతి ఉత్పత్తిపై ఓరియంటల్ ఇన్సూరెన్స్: నిరంజన్ రెడ్డి