నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. పలు దుకాణ సముదాయాల్లో తనిఖీలు నిర్వహించారు. కొన్ని దుకాణాల్లో ధర, తయారీ తేదీ లేకుండా నిత్యావసర వస్తువులు అమ్ముతున్నట్లు గుర్తించారు. దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాలన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలపై హైకోర్టులో విచారణ