కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమవంతు సాయంగా లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారo గ్రామంలోని కూలీలకు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలకు మాస్కులు పంపిణీ చేశారు. కొవిడ్ రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉన్నందున గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పనులకు వెళ్లే సమయంలో, బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా విపత్కర సమయంలో సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని ఫౌండేషన్ సభ్యుడు నర్సింహ రావు కోరారు. ఈ కార్యక్రమంలో తగుళ్ల శ్రీను, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ చికిత్సలో సీటీ స్కాన్ ఎంత మేరకు ఉపయోగపడుతుంది?