ETV Bharat / state

గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు - miryalaguda mla bhaskar rao in gandhi birth anniversay celebrations

నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో జాతిపిత మహాత్మా గాంధీ జయంత్యుత్సవాన్ని నిర్వహించారు. సాగర్​రోడ్​లో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే భాస్కరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ ఆశయ సాధనకు మనమంతా కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

mahatma gandhi birth anniversary celebrations in miryalaguda nalgonda district
గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు
author img

By

Published : Oct 2, 2020, 1:41 PM IST

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని సాగర్ రోడ్​లో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే భాస్కరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గాంధీ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. జాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆశయ సాధనకై మనమంతా కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.

మహాత్ముని స్ఫూర్తితో..

మహాత్ముని స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారనీ, రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, పట్టణంలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. తాగునీరు, రోడ్లు, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ నిధులు సమకూర్చుతున్నారనీ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్​ తిరునగరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఓటమికి కారణం మా తప్పులే : కేఎల్​ రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.