Madhuyaski Goud Fires on Rajagopal Reddy: మునుగోడు ప్రజలకు పేలాలు పెట్టి.. రాజగోపాల్ రెడ్డి బిర్యానీ తింటున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ విమర్శించారు. చిల్లి గవ్వలేని తన కంపెనీ అభివృద్ది కోసమే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరారని ఆరోపించారు. ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్‌ను విడుదల చేసిన మధుయాష్కీ.. బొగ్గు కుంభకోణం వివరాలు బయటపెడుతున్నట్లు తెలిపారు. నష్టాల్లో ఉన్న సుశీ ఇన్ఫ్రా కంపెనీకి రూ.18 వేల కాంట్రాక్టు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరినందుకే చంద్రగుప్త బొగ్గు గని టెండర్ పొందారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయమంతా బ్యాక్ డోర్ లాబీయింగ్‌గా ఆయన అభివర్ణించారు. మునుగోడులో ప్రజల స్థితిగతులు మారాలి కానీ నాయకులది కాదని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి మునుగోడులో ఓటు వేయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని.. మునుగోడు ప్రజలు తెరాస, భాజపాల దవడ తిరిగేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
"మునుగోడు ప్రజలకు డబ్బు ఎర వేయాలని రాజగోపాల్‌రెడ్డి యత్నిస్తున్నారు. మునుగోడు ప్రజలకు పేలాలు పంచి.. రాజగోపాల్‌రెడ్డి బిర్యానీ తింటున్నారు. నష్టాల్లో ఉన్న తన కంపెనీకి భాజపా కాంట్రాక్టు ఇచ్చింది. అదానీకి ఇచ్చిన ప్రాజెక్టును రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌రెడ్డితో బేరసారాలు జరిగాయి. రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టు విషయమై ఆధారాలతో చూపిస్తున్నాం. రాజకీయ లబ్ధి, తన కంపెనీ లాభాల కోసం రాజగోపాల్‌రెడ్డి పని చేశారు".- మధుయాష్కీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్
ఇవీ చదవండి: