నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ తెల్లవారుజామున బోల్తా పడింది. అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్న వారు ఈ విషయం పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తెల్లవారుజామునే బోల్తా పడిన లారీని ఘటన స్థలం నుంచి తీసుకెళ్లారు.
బియ్యాన్ని మాత్రం అక్కడే వదిలి వెళ్లటంతో రోడ్డు పక్కన వెళ్లే జనం బియ్యం కోసం ఎగబడ్డారు. బియ్యం బస్తాలను ఆటోల్లో, ద్విచక్రవాహనంపై తరలించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు బియ్యం కోసం వస్తున్న జనాలను అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: ఫోన్ కోసం 60 అడుగుల బావిలో నీటిని తోడేశాడు!