నాగార్జున సాగర్‌కు (NAGARJUNA SAGAR) ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు(sagar 6 crust gates opened). ప్రాజెక్టు నుంచి 48,474 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా వదులుతున్నారు.
ప్రాజెక్టులోకి 92, 441 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 48,474 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.44 టీఎంసీలకు చేరింది. ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహాన్ని గమనిస్తూ గేట్ల సంఖ్య పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: Assembly Sessions 2021: పర్యాటకులు అసౌకర్యం కల్పిస్తే జైలు, జరిమానా