తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు నల్గొండ జిల్లా చిట్యాల మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేకు కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ప్రత్యేక తెలంగాణ కేసం కేటీఆర్ అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో తెరాస సీనియర్ నాయకులు జడల ఆదిమల్లయ్య, కోమటిరెడ్డి చిన్నవెంకట్రెడ్డి, పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః బీరు సీసాలో వక్కపొడి ప్యాకెట్..!