ETV Bharat / state

'ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల రుణాన్ని అభివృద్ధితో తీర్చుకుంటాం' - KTR review on development joint Nalgonda district

KTR Review Joint Nalgonda District: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్​ను గెలిపించిన ప్రజల రుణాన్ని అభివృద్ధితో తీర్చుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాబోయే 6 నెలల్లో రూ.1544 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 1, 2022, 7:56 PM IST

KTR Review Joint Nalgonda District: మునుగోడులో గెలిపించిన నెలరోజుల్లోనే ఐదుగురు మంత్రులం మునుగోడుకు వచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. రాబోయే 6 నెలల్లో రూ.1544 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. తండాల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి రోడ్లు బాగు చేస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో రూ.175 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై మునుగోడులో ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మునుగోడులో త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. చండూరు మున్సిపాలిటికీ రూ.50కోట్లు, చౌటుప్పల్‌ మున్సిపాలిటీకి రూ.30కోట్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్త 5 సబ్‌ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చండూరును త్వరలో రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని ప్రకటించారు. నారాయణపురంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మునుగోడు నియోజకవర్గంలో బొమ్మల తయారీ పరిశ్రమ నెలకొల్పుతామని కేటీఆర్ చెప్పారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలు తెరాస వశమయ్యాయని అన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు టీఆర్ఎస్​ను చాలా గొప్పగా ఆదరించారని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.

వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రెండో స్థానం: 2014కు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా దామెరచర్లలో థర్మల్‌ విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తెలిపారు. వరి ఉత్పత్తిలో నల్గొండ జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చు.. దేశంలో తెలంగాణ రెండో స్థానానికి చేరిందని అన్నారు. రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచేలా యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, ప్రశాంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

"మా మంత్రుల తరఫున, ముఖ్యమంత్రి తరఫున నల్గొండ జిల్లా ప్రజలకు ఇవ్వాలనుకున్న హామీ ఏంటంటే మీరు టీఆర్ఎస్​ను గుండెల్లో పెట్టుకొని 12అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్​ను గెలిపించారు. ఆ విధంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. దానికి తగిన విధంగా మాటలతోనే సరిపెట్టకుండా ఎన్నికల ఫలితం వచ్చినా నెలలోపే మేము మునుగోడుకు వచ్చాం. రాబోయే 6 నెలల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1544 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. తద్వారా నల్గొండ బిడ్డల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం." - కేటీఆర్, మంత్రి

'ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల రుణాన్ని అభివృద్ధితో తీర్చుకుంటాం'

ఇవీ చదవండి: కేంద్రం నుంచి నిధులు తెచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి: హరీశ్‌రావు

ప్రశాంతంగా ముగిసిన గుజరాత్​ తొలి దశ సమరం.. ఈవీఎంల్లో ప్రజా తీర్పు నిక్షిప్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.