ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరసనకు దిగారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ యార్డు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
రైతులు నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నా.. ఇప్పటి వరకు కొనుగోళ్లు చేపట్టలేదని ఎంపీ ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కొనుగోళ్లను ప్రారంభించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల