KCR Election Campaign in Nalgonda District Today : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కేసీఆర్.. నేడు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. పట్టణ శివారులో నిర్వహించే సభకు సుమారు లక్ష మంది జనం వస్తారని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సభావేదికతో పాటు నాయకులు, కార్యకర్తలు కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హుజుర్‌నగర్ మొత్తం గులాబీమయంగా మారిందని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరూ లేరని సైదిరెడ్డి అన్నారు.
CM KCR Nalgonda District Tour Today : హుజూర్‌నగర్ సభ అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvad Sabha)లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. మిర్యాలగూడలోని ఎన్సీపీ క్యాంప్ గ్రౌండ్లో జరిగే సభకు సుమారుగా 50 వేల మంది హాజరవుతారని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. సభకు హజరయ్యే నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
CM KCR Speech at Asifabad Public Meeting : ''ధరణి'ని తీసేస్తే మళ్లీ పైరవీకారులు, లంచగొండుల రాజ్యం'
"కేసీఆర్ సభకు హుజూర్‌నగర్ నలుమూలల నుంచి జనం తరలివస్తారు. వారందరూ కేసీఆర్ మీటింగ్ వినడానికి, కేసీఆర్ స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సభతో హుజూర్‌నగర్ మొత్తం గులాబి మయం కాబోతుంది. ప్రజలందరూ వచ్చి కేసీఆర్ సభను జయపద్రం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను."- శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి
CM KCR Speech at Medchal Public Meeting : "హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తాం"
Devarakonda KCR Public Meeting Today : హుజూర్‌నగర్, మిర్యాలగూడ సభలు అనంతరం చివరిగా దేవరకొండ నియోజకవర్గంలోని శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థివర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర నాయక్(MLA Ravindra naik) ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. సభలో దాదాపు 50 వేల మంది ప్రజలు పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున భారీగా కేసీఆర్(KCR) సభకు వచ్చేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తాన్నామని సైదిరెడ్డి తెలిపారు. ఈ సభకు సుమారు 80 వేల నుంచి లక్ష మంది వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశాం. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననుండటంతో అభ్యర్థులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.