KA Paul Dance Video Viral: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. అయితే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు మునుగోడులో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన పార్టీ తరఫున వేసిన నామినేషన్ చెల్లదని ఈసీ ప్రకటించింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్... నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే పాల్ ఇచ్చే హామీలు... ప్రజలకు మాత్రం నవ్వులు తెప్పిస్తున్నాయి. మొన్నటికి మొన్న... 6నెలల్లో మునుగోడును అమెరికాను చేసి పడేద్దాం అంటూ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ క్రమంలో తాజాగా మునుగోడు ప్రజలతో కలిసి నృత్యం చేసి అలరించారు. ప్రజాశాంతి పార్టీ గీతానికి స్టెప్పులేశారు. ఆయన హుషారుగా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఇవీ చదవండి: