భవిష్యత్‌పై ఎన్నో ఆశలు, వైకల్యం వెక్కిరిస్తున్న మొక్కవోని దీక్షతో చదివింది. పరీక్ష రాసింది. ఫలితాలు వచ్చాయి. ఎంతో ఆతృతతో మార్కులు చూసుకుందామనుకున్న ఆమెకు నిరాశే మిగిలింది. తన హాల్ టికెట్ నంబర్ టైప్ చేస్తే రిజల్ట్ నాట్ ఫౌండ్ అని చూపించింది.
ఎక్కడికెళ్లిన నిరాశే
నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన శిలివేరు లిఖిత అనే దివ్యాంగురాలు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివింది. మార్చ్‌లో పరీక్షలు రాసింది. ఫలితాల్లో లిఖిత నంబర్ కనిపించిలేదు. ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు కశాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. వారు పై అధికారులకు విషయం తెలియజేస్తామని చెప్పారు. ఇన్నీ రోజులైన ఫలితాల్లో తన నంబర్ రావడం లేదని లిఖిత వాపోయింది. జిల్లా అధికారుల దగ్గరికి వెళ్లగా ఇంటర్ బోర్డు సంప్రదించాలని చెప్పారని బోరున విలపించింది.
ఫీజు కడతామంటే ఆన్లైన్లో నంబర్ చూపించడంలేదని లిఖిత తండ్రి చెబుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థకావడంలేదని వాపోతున్నారు. ఇవీ చూడండి: పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య