ETV Bharat / state

తారాస్థాయికి చేరిన ప్రచారం.. చిన్న పార్టీలతో పెద్ద పార్టీలకు చిక్కులు - మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో చిన్న పార్టీలు

munugode by election: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం తార స్థాయికి చేరగా.. ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలకు పోటీగా ప్రచారం నిలుస్తూ వాటికి సవాల్‌ విసురుతున్నాయి. కేవలం పార్టీ ప్రతిష్ఠే కాకుండా కుల సమీకరణాలు కూడా చేస్తూ చాప కింద నీరులా ముందుకు సాగుతున్నాయి.

munugode by election
munugode by election
author img

By

Published : Oct 24, 2022, 6:48 AM IST

Updated : Oct 24, 2022, 7:11 AM IST

తారాస్థాయికి చేరిన ప్రచారం.. చిన్న పార్టీలతో పెద్ద పార్టీలకు చిక్కులు

munugode by election:మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో బరిలో ఉన్న చిన్న పార్టీలు, స్వతంత్రుల వల్ల ఎవరికి నష్టం అనే కోణంలో ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రతి ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటం.. ఇందులో చాలా మంది క్షేత్రస్థాయిలో సీరియస్‌గానే ప్రచారం చేస్తుండటంతో ఏ పార్టీ ఓట్లు చీల్చతారు? ఎవరి విజయావకాశాలు దెబ్బతీస్తారనే ఆందోళన ప్రధాన పార్టీల నాయకుల్లో కనబడుతోంది.

రాష్ట్రంలో గతంలో జరిగిన ఉపఎన్నికల కన్నా మునుగోడు పరిస్థితులు కొంత భిన్నంగా ఉండటం.. త్రిముఖ పోటీ నెలకొనడంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్‌లతో పాటూ బీఎస్పీ, తెలంగాణ జనసమితి, సకల జనుల పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ, సోషల్‌ జస్టీస్‌ పార్టీ, యుగతులసి, ప్రజావాణి, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తదితర పార్టీలు బరిలో ఉన్నాయి.

33 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో: ఈ పార్టీలు కాకుండా 33 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిప్పుడు ప్రధాన పార్టీల గెలుపోటముల్లో కీలకంగా మారారు. నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం తర్వాత దళితుల ఓటు బ్యాంకు సుమారు 35 వేల వరకు ఉంది. దీంతో బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్​ అధికారి ప్రవీణ్‌ కుమార్‌.. మూడు వారాలుగా విస్తృత ప్రచారం చేస్తూ దళితుల ఓట్లతో పాటూ పెద్ద సంఖ్యలో ఉన్న అభ్యర్థి సామాజిక వర్గమైన బీసీలపైనా దృష్టి పెట్టారు.

వీరితో పాటూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించామని చెప్పుకుంటూ తెలంగాణ జనసమితి సైతం మేధావులు, విద్యార్థులు, యువజన సంఘాల ఓట్లును అభ్యరిస్తోంది. దీంతో వీరు ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు పోనూ 12 మంది స్వతంత్రులు పోటీలో నిలిచారు.

వీరికి మొత్తం 11,106 ఓట్లు రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. బ్యాలెట్‌ యూనిట్‌లో చివరగా ఉన్న రోడ్‌రోలర్‌ గుర్తు అభ్యర్థి మంగ వెంకటేశ్‌... స్వతంత్రుల్లో అత్యధికంగా 3,569 ఓట్లు సాధించారు. ఇప్పుడూ రోడ్‌రోలర్‌ గుర్తు మొదటి బ్యాలెట్‌ యూనిట్‌లోనే ఉండటం అధికార పార్టీ తెరాసను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత ఎన్నికల్లో మరో స్వతంత్రుడు చిలువేరు నాగరాజు 2,279 ఓట్లు సాధించగా, గోశిక కరుణాకర్‌కు 2,080 ఓట్లు వచ్చాయి.

గెలుపోటములు తారుమారయ్యే అవకాశం: ప్రస్తుతం పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు ఉండటంతో పాటూ ఇది ఉపఎన్నిక కావడంతో ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో స్వతంత్రలలందరూ కలిసి హీనపక్షం 10 వేల ఓట్లు సాధించినా గెలుపోటములు తారుమారయ్యే అవకాశముందని ప్రధాన పార్టీలు నాయకులు అంచాన వేస్తున్నారు.

మరోవైపు నోటాకు సైతం గత ఎన్నికల్లో గణనీయంగానే ఓట్లు వచ్చాయి. మొత్తం 3,086 మంది నోటా మీట నొక్కారు. ప్రస్తుతం బరిలో ఉన్న స్వతంత్రులు సామాజిక వర్గాల వారీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరూ ఓటేసినా.. లేకున్నా తమ సామాజిక వర్గం నుంచి ఓట్లు పడితే చాలు అన్నట్లు కొంత మంది అభ్యర్థులు తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 24, 2022, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.