నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నిన్న ఒక్కో కేసు చోప్పున బయటపడ్డాయి. మూడురోజుల్లో యాదాద్రి జిల్లాలో నాలుగు కొవిడ్ కేసులు నమోదు కాగా... నల్గొండ జిల్లాలో మూడు కేసులు నిర్ధారణయ్యాయి.
విజయవాడ నుంచి తిరిగివచ్చిన నల్గొండ యువకుడికి మంగళవారం పాజిటివ్ రాగా... ఆయన ఏడు నెలల కుమారుడికి సైతం వైరస్ అంటినట్లు తేలింది. ఇప్పటికే సదరు యువకుడి కుటుంబానికి చెందిన ఏడుగురిని పరీక్షలకు తరలించగా... ఒకరిలో వ్యాధి నిర్ధారణ అయ్యింది.
ఈ 2 కేసులు వలస జాబితాలో చేరాయి. ఇక యాదాద్రి జిల్లా ఆలేరు మండలానికి చెందిన మహిళకు కరోనా సోకింది. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ ఈనెల 28న సికింద్రాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధిత లక్షణాల వల్ల పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ వచ్చింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు 9 బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్కి ఓవర్ స్పీడ్ చలానాలు